అంగన్వాడీల అభివృద్ధి కోసమే కమిటీలు పని చేయాలి
మెంటాడ ,పెన్ పవర్మండల కేంద్రం మెంటాడ లోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారము అంగన్వాడి అభివృద్ధి కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్టార్ సూపర్వైజర్ హైమావతి, రమాకుమారి లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అంగన్ వాడి కేంద్రాలను అద్భుతంగా తయారు చేసి, గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే విధంగా కమిటీలు నిరంతరం కృషి చేయాలని వారు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. నాడు నేడు పనులపై కూడా దృష్టిసారించి అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం, మరమ్మతుల కోసం కమిటీలు ముందుకు రావాలని వారన్నారు. ప్రస్తుతము కరోనా తీవ్రంగా ఉందని ప్రతి ఒక్కరూ బహుదూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరిస్తే సత్ఫలితాలు పొందవచ్చు అని వారు పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మాస్కులు ధరించే విధంగా కమిటీలు బాధ్యతగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment