మావోల బంద్ సందర్భంగా వాహనాలు విస్తృత తనిఖీ
కూనవరం, పెన్ పవర్
మావోయిస్టుల పిలుపుమేరకు సోమవారం బంద్ సందర్భంగా కూన వరం ఎస్సై గుణశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద ద్విచక్ర వాహనాలు, ఆటోలు,కార్లు,లారీలను ఆపి వాహనాలను క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించారు.గ్రామాలలో అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తున్నట్ల అయితే వెంటనే సమాచారం ఇవ్వాలని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కూలు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని,అనవసరంగా ఎవరు ప్రయాణాలు చేయకూడదని అట్టి వారు తారసపడి నట్లయితేశిక్ష అర్హులని పేర్కొన్నారు.అత్యవసర పరిస్థితుల్లోనే ఇంటి నుంచి బయటకు రావాలని ప్రజలకు తెలిపారు. ముందస్తుగా కరోనా వ్యాక్సిన్ బాధ్యతగా ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని,కరోనాను తరిమివేయాలని,ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలోపోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment