నగరాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తాం.... నగర మేయర్
విజయనగరం కార్పొరేషన్ ని పాలకవర్గం అంతా ఉమ్మడి గా ఎమ్మెల్యే కోలగట్ల సూచనల మేరకు అభివృద్ధి వైపు నడిపిస్తామని విజయనగరం కార్పొరేషన్ మేయర్ శ్రీమతి వెంపడాపు విజయలక్ష్మి అన్నారు, విజయనగరం జిల్లా పౌరవేధిక ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమావేశ మందిరంలో జరిగిన కార్పొరేషన్ నూతన కార్యవర్గ సత్కారసభలో ఆమె పాల్గొన్నారు ముందుగా బాబూ జగజీవన్ రామ్ 113 వ జయంతి సందర్భంగా జగజీవన్ రామ్ చిత్ర పటానికి మాల వేసి జ్యోతి వెలిగించిన అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంచాయతీ లు,మున్సిపాలిటీ లు కార్పొరేషన్ల అభివృద్ధి కి ఇప్పటికే అనేక సూచనలు చేశారని ప్రభుత్వం కూడా అభివృద్ధి కోసం ఆడిగినన్ని నిధులు మంజూరు చేయాలని చూస్తుందని,ప్రజలకు తమ పాలక వర్గ నిత్యం అందుబాటులో ఉంటున్నదనే మంచి పేరు తెచ్చుకుంటుందని మేయర్ విజయలక్ష్మి అన్నారు, డిప్యూటీ మేయర్ శ్రీమతి ముచ్చు నాగలక్ష్మి మాట్లాడుతు ప్రతివార్డులో ప్రజాసమస్యలపై అవగాహన పెంచుకుని ఎమ్మెల్యే కోలగట్ల తో చర్చించి సత్వర చర్యలు చేపడతామని ముఖ్యంగా మహిళా సమస్యలపై దృష్టి పెడతామని అన్నారు.
జిల్లా పౌరవేధిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి మాట్లాడుతు పట్టణంలో ప్రతి ప్రధాన వీధికి చరిత్రకారుల పేరులు ఉండాలని, నగరంలో కి ప్రవేశించే మూడు ప్రాంతాల్లో నగరం గొప్పతనం తెలిపే సింహ ద్వారాలు ఏర్పాటు చేయాలని, మేయర్ కార్పొరేటర్లు నగరాన్ని అందంగా తీర్చి దిద్దాలని,తొలి కార్పొరేషన్ పాలకులుగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు, నగర స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ శెట్టి వీర వెంకట రాజేష్ మాట్లాడుతూ కార్పొరేటర్లు భవిష్యత్తు లో ఎలా పనిచేసి ఎమ్మెల్యే కి ప్రభుత్వం కి మంచిపేరు తేవాలో అందరికీ వివరించారు,పార్టీ సీనియర్ నాయకుడు అపనా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ ఆసుపత్రులు, పాఠశాలలు అభివృద్ధి పై ప్రతిఒక్కరు పనిచేస్తే ప్రజలకు మంచి సేవలు అందుతాయని అన్నారు,ఛతిష్ ఘడ్ ఎన్కౌంటర్ లో మరణించిన విజయనగరం వాసి రౌతు జగదీష్ తోపాటుగా మరణించిన జవాన్లు ఆత్మకు శాంతి కలగాలని సభ మౌనం పాటించింది,అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ లను పౌరవేధిక ప్రతినిధులు ఘనంగా సత్కరించారు,వేదిక ప్రతినిధులు ఎన్.వి.ఎన్.బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు నాగేశ్వరరావు, ఇప్పలవలస గోపీ,గెద్ద చిరంజీవి,మమ్ముల తిరుపతి రావు, బసవ మూర్తి,సీనియర్ జర్నలిస్టు శివాజీ, నాగభూషణం, రాజారావు,నాయుడు,కోరుకొండ బుజ్,పొలుపర్తి అప్పారావు,రఘు రాం, జామి ఎర్ని బాబు,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment