Followers

సినీ రంగంలో దూసుకెళ్తున్న తైదల బాపు

 సినీ రంగంలో దూసుకెళ్తున్న తైదల బాపు

400 పైగా పాటల రచన

సినీ ప్రముఖులచే ప్రశంసలు

బెల్లంపల్లి , పెన్ పవర్

సినీరంగంలో నిలదొక్కుకోవాలంటే ఎంత కష్టమో అది అందరికీ తెలుసు.అలాంటి రంగంలో తనకంటూ ముద్ర వేసుకున్నారు.మంచిర్యాల జిల్లాలోని తాండూరు లోని మాదారంకు చెందిన వెంకటి-సత్తెమ్మ కుమారుడు తైదల బాపు.చిన్ననాటి నుండే అలవాటైన పాటలను తన భవిష్యత్తుకు పునాదిగా వేసుకున్నాడు.ఉన్నత విద్యాబ్యాసం కోసం హైదరాబాద్ కు వెళ్లగా ,అక్కడే చిన్నచిన్న పాటలు వ్రాస్తూ తైదల బాపు కొన్ని సంవత్సరాలలో సుమారు 400 వందలకు పైగా పాటలను రచించాడంటే అతి శయోక్తి కాదు. అందులో గర్ల్ ఫ్రెండ్,పటాస్,శ్రీరామచంద్రులు,ప్రేమలో పావని కళ్యాణ్ లాంటి సినిమాలలో వ్రాసిన పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. అంచెలంచెలుగా ఎదుగుతున్న బాపును సినీ రచయితల సంఘం సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో దర్శకేంద్రులు రాఘవేంద్రరావు ఘనంగా సన్మానించారు.సినీ ప్రముఖులు చిరంజీవి,ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్,మోహన్ బాబు,పరుచూరి బ్రదర్స్, లాంటి వారు ఎందరో బాపు ను అభినందించారు.ఓ వైపు పాటలను రచిస్తూనే,నిర్మాత గా అడుగుపెట్టాడు.ఇటీవల తను పుట్టిన ప్రాంతంలో సినిమా తీయాలనే ఉద్దేశంతో హీరో సంపూర్ణేష్ బాబు,ఆమని, కవిత,షియాజి షిండే,లాంటి వారితో బెల్లంపల్లి లో సినిమా షూటింగ్ ను ప్రారభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,రామగుండం సీపీ సత్యనారాయణ లు పాల్గొని,పుట్టిన ఊరిలో సినిమా తీయడం నిజంగా అభినందనీయం అన్నారు.తైదల బాపు ముందునుంచి జానపద పాటలంటే ఎంతో ఇష్టాంగా వ్రాస్తూ వుండే వాడు. గర్ల్ ఫ్రెండ్ చిత్రం తర్వాత తన బాణీని మార్చి ఇటు క్లాస్ కు, అటు మాస్ కు తనదయిన శైలిలో పాటలను వ్రాస్తూ ముందుకెళ్తున్నారు. తన జీవితంలో ఈ స్థాయికి రావడానికి తన మిత్రులు ఎంతో సహాయం చేసారని. మొదట్లో హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యేవి, వాటిని భరిస్తూ ముందుకు వెళ్లానని అన్నారు.ఇదే నా మొదటి ప్రేమలేఖ సినిమాకు బాపు వ్రాసిన చెలియా నువ్వే నాయెదలో దాగింది అనే పాట విని సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రత్యేకంగా ప్రశంసించారని బాపు చెపుతుంటారు. దాదాపు 260 చిత్రాలలో 430 పాటలు వ్రాశానని. కెరీర్ పరంగా మాత్రం పటాస్ సినిమా నన్ను మరో స్థాయికి చేర్చిందని అన్నారు. అందులో వ్రాసిన టప్పు టపప్పోమ్ పోరి అనే పాటకు మంచి గుర్తింపు తెచ్చిందని అన్నారు . మంచిర్యాల జిల్లావాసి సినీరంగంలో పాటల మాంత్రికుడిగా దూసుకెళ్తున్నందుకు జిల్లా ప్రజలు బాపు పుట్టిన రోజు సందర్బంగా ప్రత్యేక శుభాకాంక్షలు  తెలుపుతున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...