Followers

కర్ఫ్యూకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

 కర్ఫ్యూకు  ప్రతి ఒక్కరూ సహకరించాలి

- ప్రజలు నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి.

ఎస్ఐ విజయ్ రామ్ కుమార్

చిన్నగూడూరు, పెన్ పవర్

కరోనా వైరస్ రెండవ దశ వ్యాప్తి అరికట్టడం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించిందన్నారు. కర్ఫ్యూ ను మండల కేంద్రంతో పాటు అన్నీ గ్రామాలలో పక్కాగా అమలు చేస్తామని దీనికి గ్రామ ప్రజలు ,సర్పంచులు, ప్రజాప్రతినిధులు, యువకులు ప్రతి ఒక్కరూ సహకరించాలని చిన్నగూడూరు ఎస్సై విజయ్ రామ్ కుమార్  ఒక ప్రకటనలో తెలిపారు. కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుండి తెల్లవారు జామున 5 గంటల వరకు  ఉంటుందని,రాత్రి 8 గంటల వరకు అన్ని  కిరాణా షాపులు,  బెల్టుషాపులు, మొదలగు అన్నింటిని మూసివేయాలని, రాత్రి 9 గంటల తర్వాత ప్రజలు రోడ్లపై కి రావొద్దు అన్నారు. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించి బయట తిరిగి నట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. కర్ఫ్యూ నుంచి అత్యవసర సర్వీస్ లైన పెట్రోల్ బంక్, పత్రిక ప్రతినిధులకు మినహాయింపు ఇవ్వగా, ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్ షాప్ సిబ్బంది, తప్పనిసరిగా ఐడి కార్డులు ఉంచుకోవాలని సూచించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...