Followers

శానిటైజర్స్, మాస్కులు, పంపిణీ చేసిన మళ్ళ సురేంద్ర

 శానిటైజర్స్, మాస్కులు, పంపిణీ చేసిన మళ్ళ సురేంద్ర 

అనకాపల్లి, పెన్ పవర్

పట్టణంలోని స్థానిక వన్ వే ట్రాఫిక్ జంక్షన్ డౌన్లో   నెయ్యాల వీధిలో మరియు ఎన్టీఆర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ రామానాయుడు కాలనీలలో  పేద కుటుంబాలకు తెలుగుదేశంపార్టీ విశాఖజిల్లా ఉపాధ్యక్షులు మళ్ళ సురేంద్ర ధన సహాయంతో అందరికీ శానిటైజర్స్, మాస్కులు,పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ మనం కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ భౌతిక దూరం పాటిస్తూ ప్రజలు కరోనా కష్టాల్లో ఉన్నారని ఇటువంటి సమయంలో మనం ధైర్యంగా ఉంటూ వారికి ధైర్యం చెబుతూ  అవకాశం ఉన్నంత వరకు అందుబాటులో ఉంటూ వీలైనంత సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు.

ప్రజలు కూడా కరోనా నుండి రక్షణ కొరకు ఇళ్లలోనే ఉంటేనే ఈ కరోనా విలయతాండవాన్ని నివారించవచ్చు అని ప్రజలను కోరారు.అత్యవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలి అని అదికూడా మాస్క్,శానిటైజర్ తప్పకుండా వాడాలి అని కోరారు.45 దాటిన అందరూ కూడా భయపడకుండా వేక్సిన్ వేయించుకోవాలి అని పిలుపునిచ్చారు.వేక్సిన్ ఒక్కటే నివారణ అని తెలియ జేశారు.  ఈ కార్యక్రమంలో యల్లపు శ్రీనివాసరావు, వేగి కృష్ణ,అనకాపల్లి రాము,ఎండకుర్తి అప్పలరాజు,అనకాపల్లి శేఖర్,అనకాపల్లి మోహన్,తిప్పన అప్పారావు,బుద్ధ జోగినాయుడు,మోనో శ్రీను,జొన్నాడ సురేష్, ఎస్, భాను చందర్ అఖి మరియు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...