బీచ్ రోడ్ పరిసర ప్రాంతాలపర్యటనలో వంశి క్రిష్ణ
విశాఖ తూర్పు, పెన్ పవర్
వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ 21 వార్డ్ పరిధిలో గల ఆర్.కె.బీచ్ నుంచి వైఎంసి, పామ్ బీచ్ వైస్సార్ విగ్రహం వరకు పర్యటించారు.స్మార్ట్ సిటీ విశాఖ బీచ్ రోడ్ లో పర్యాటకులు నిరంతరం వస్తున్న నేపథ్యంలో బీచ్ తీర ప్రాంతంలో రోడ్ ,డ్రైనేజీ ,ఫుట్ పాత్ ల మరమ్మతులు ఎప్పటికప్పుడు చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. స్థానిక జీవీఎంసీ సిబ్బంది తో కలసి మరమ్మతులు చేపట్టవలసిన ప్రాంతాలను గుర్తించారు. అదేవిధంగా వార్డ్ లో వివిధ సమస్యలు పై సంబంధిత అధికారులు తో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షుడు మధుపాడ రవికుమార్ ,జీవీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment