స్టీల్ ప్లాంట్ కు సొంత ఘనులు కేటాయించాలి... ఐ.ఎన్.టి.యు.సి
మహారాణి పేట, పెన్ పవర్
ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని ఐ.ఎన్.టి.యు.సి నేత మంత్రి రాజశేఖర్ పేర్కొన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆదివారం సాయంత్రం ఆర్కే బీచ్ లో ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.వి.జె.ఎఫ్. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే కేంద్రంపై పెద్దఎత్తున ఉద్యమించ నున్నట్లు పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వ సంస్థలను కొంతమంది పారిశ్రామికవేత్తల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రైవేటీకరణ చేస్తే బిజెపి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత కన్నుల్లో కేటాయించాలన్నారు ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఐ.ఎన్.టి.యు.సి నేతలు మస్తాన్ రావు,పైడ్రాజు,నాగభూషణం,రామారావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు.
No comments:
Post a Comment