Followers

జమ్మిగడ్డ పీహెచ్ సి లో వ్యాక్సినేషన్ వేయించుకున్న.. ఎంపీ రేవంత్ రెడ్డి

 జమ్మిగడ్డ పీహెచ్ సి లో వ్యాక్సినేషన్ వేయించుకున్న.. ఎంపీ రేవంత్ రెడ్డి

పెన్ పవర్ , కాప్రా

మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం కాప్రా సర్కిల్ పరిధిలోని జమ్మిగడ్డ పి హెచ్ సి లో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. పిహెచ్ సి ఇన్ ఛార్జ్ డాక్టర్ సంపత్ ఎం పి రేవంత్ రెడ్డికి వ్యాక్సినేషన్ వేశారు. ఈ సందర్భంగా పిహెచ్ సీ లో జరుగుతున్న కరోన టెస్ట్ లు, వ్యాక్సినేషన్ గురించి ఎంపీ రేవంత్ రెడ్డి డాక్టర్ సంపత్, డాక్టర్ స్వప్న రెడ్డిలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మల్లికార్జున్, ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, టిపిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్,  ఏఎస్ రావు నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త అంజిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బి. రాఘవ రెడ్డి నాయకులు నీరుకొండ సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...