Followers

ప్రభుత్వ వైద్యశాల పట్ల ప్రజలకు నమ్మకం కలిగేలా చేయాలి

 ప్రభుత్వ వైద్యశాల పట్ల ప్రజలకు నమ్మకం కలిగేలా చేయాలి     

మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమావేశపు హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే  

పెన్ పవర్, కందుకూరు

ప్రభుత్వ వైద్యశాలలో శస్త్ర చికిత్సలు చేసి ప్రజలకు ప్రభుత్వ వైద్యశాల పట్ల నమ్మకం కలిగేలా చేయాలని స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని కమ్యూనిటీ హాల్, కాంపౌండ్ వాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 50 లక్షల రూపాయలతో, కమ్యూనిటీ హాల్,  కాంపౌండ్ వాల్ కు ఎప్పుదో నిధులు మంజూరైతే  గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు అయినప్పటికీ నిర్మించకుండా వదిలేశారని అన్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒక్క మాచవరం గ్రామానికి సంబంధించింది కాదని మండలం మొత్తానికి సంబంధించిన వైద్యశాల అని అన్నారు. ప్రభుత్వం నుంచి రాని మందులను  డాక్టర్ల సలహా మేరకు నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కోవిడ్ నిధుల నుంచి సుమారు లక్షా 20 వేల రూపాయలతో అందజేసినట్టు తెలిపారు. కందుకూరు ఏరియా వైద్యశాలకు అత్యాధునిక పరికరాలు సమకూర్చగా ఇటీవల శస్త్రచికిత్స సైతం చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో ఆధునీకరించడం తో కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాల, ఉలవపాడు సి హెచ్ సి లకు రోగుల సంఖ్య పెరిగిందని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ఆధునిక పరికరాల కోసం దాతలను బలవంతం లేకుండా వారి సహకారంతో ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకరించతామని తెలిపారు. అర్బన్ హెల్త్ సెంటర్ కు ప్రభుత్వం భవన నిర్మాణం కోసం 80 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసిందని అన్నారు.

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైద్య రంగం మీద ప్రత్యేక శ్రద్ధ ఉందని పీహెచ్సీలలో ఇద్దరు వైద్యాధికారులను నియమించారని అన్నారు. వైద్యశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి  రేషన్ ఏ విధంగా డోర్ డెలివరీ చేస్తున్నారో, వైద్యాన్ని కూడా అలాగే డోర్ డెలివరీ చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఏరియా వైద్యశాలకు 7.50 కోట్ల రూపాయలతో నూతన భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. దాతలు సమకూర్చిన స్టెయిన్లెస్ స్టీల్ బెడ్లు 30 సిద్ధంగా ఉన్నాయని అని దీనిలో కోవిడ్ నిధుల నుంచి 80 వేల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తన హాస్పిటల్ నుండి ఇరవై మూడు మంచాలు పంపించగా 17 మంచాలు సిద్ధం చేశామని తెలిపారు. మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వేణుగోపాల్ రెడ్డి  5 మంచాలు అందజేశారని తెలిపారు. ఈ పి హెచ్ సి గ్రామస్తుల సహకారం తో 7 లక్షల రూపాయలతో ఈ స్థలాన్ని కొనుగోలు చేసి అప్పగించినట్లు తెలిపారు. కావున వైద్య సేవలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం హెచ్ ఓ ప్రియంవద, డాక్టర్ స్వాతి, తహసీల్దార్ సీతారామయ్య, ఎస్సై కొత్తపల్లి అంకమ్మ, వేణుగోపాల్ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...