పుల్లగుమ్మి గ్రామాన్ని సందర్శించిన తాసిల్దార్ రవి
మెంటాడ మండలం, ఉద్దంగి పంచాయితీ శివారు పులిగుమ్మి గిరిజన గ్రామాన్ని మెంటాడ తాసిల్దార్ దూస రవి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పెన్ పవర్, ఇతర పత్రికలు అక్కడ నివసిస్తున్న గిరిజనుల సమస్యలు పడుతున్న ఇబ్బందుల గురించి వార్తలు రావడంతో ఆ గిరిజన గ్రామాన్ని సందర్శించి అక్కడ గిరిజనులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. అక్కడ గిరిజనులకు గూడు, విద్యుత్తు, తాగునీరు, రహదారి, విద్య, ఉపాధి అవకాశాలు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి వారికి కనీస సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తానని తాసిల్దార్ రవి వారికి భరోసా కల్పించారు.
అక్కడ గిరిజనులు సాగుచేస్తున్న భూములకు పట్టాలు అందజేస్తానని గిరిజనులకు హామీ ఇచ్చారు. వారికి పట్టాలు ఇచ్చి రైతు భరోసా పథకము ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బులు పడే విధంగా తీసుకుంటానని ఆయన అన్నారు. చిన్న సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను అధిగమించేందుకు కృషి చేస్తానని ఆయన గిరిజనులకు భరోసా కల్పించారు. ఇక్కడ గిరిజనులు పడుతున్న ఇబ్బందులను వెలుగులోకి తీసుకువచ్చిన పెన్ పవర్ తో పాటు ఇతర మీడియా మిత్రులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment