ముస్లిం మైనారిటీల సమస్యల పరిష్కారానికి తప్పక కృషి చేస్తాను..సబిరా బేగం
విశాఖపట్నం, పెన్ పవర్
77 వ వార్ద్ మైనారిటీ అధ్యక్షులు దావూద్ ఆధ్వర్యంలో ఇస్లాంపేటలో సన్మానసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పరేషన్ కు డైరెక్టర్లుగా నియమితులైన సబిరా బేగం (బీసీ షేక్ కోర్పొరేషన్), 53వ వార్డ్ కార్పొరేటర్ భర్కత్ ఆలి,షేక్ మున్ని, బషీరున్నిష,కాప్సన్ మెంబర్ గా నియమితులైన షరీఫ్, 77వ వార్డ్ కార్పొరేటర్ బట్టు సూర్యకుమారి,66వ వార్డ్ కార్పొరేటర్ ఇమ్రాన్,39వ వార్డ్ కార్పొరేటర్ సాదిక్ ముఖ్య అతిథులుగా హాజయ్యారు.వారికి పుష్ప గుచ్చలు అందచేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.
బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ సబిరా బేగం వారికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతూ వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగ మాటల ప్రభుత్వం కాదని ఇది చేతల ప్రభుత్వమని మైనారిటీల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వం ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని,జగనన్న ప్రభుత్వం మైనారిటీలకు పెద్ద పీట వేసిందన్నారు. ముస్లిం మైనారిటీలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దలు సర్దార్ మాస్టర్,అబ్దుల్ సుభన్,ముస్తఫా,గాఫ్ఫార్, అదిల్,షకిర్,నూర్ తాజ్ యూత్,అజాద్ యూత్ యువకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment