Followers

రావాడలో అనుమతులు లేని కంపెనీ నిర్మాణ పనులను అడ్డుకున్న గ్రామస్థులు

 రావాడలో అనుమతులు లేని కంపెనీ నిర్మాణ పనులను అడ్డుకున్న గ్రామస్థులు

పరవాడ, పెన్ పవర్

మండలం లోని రావాడ పంచాయతి శివారు బొట్ట వాని పాలెం గ్రామం లో ఎటువంటి అనుమతులు లేని సిమెంట్ రెడీ మిక్స్ ప్లాంట్ నిర్మాణం కొరకు మిషనరీ వస్తే వాటిని సర్పంచ్ మోటూరి సన్యాసినాయుడు మరియు నాయకులు, రైతులు,గ్రామస్థులు  అడ్డుకోవడం  జరిగింది.ఈ కంపెనీ నిర్మాణానికి పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేవు అని  ఈ నెల మొదటి వారంలో మండల పరిషత్ కార్యాలయంలో  గ్రామస్థులు నాయకులు కలిసి అధికారులకు కంపెనీ నిర్మాణానికి అనుమతులు ఇవ్వవద్దు అని వినతిపత్రం సమర్పించారు అని సన్యాసినాయుడు తెలియజేసారు.అయినా కంపెనీ యాజమాన్యం రాత్రి వేళల్లో దొంగ చాటుగా నిర్మాణ పనులు చేయిస్తోంది అని అరోపించారు.ఈ కంపెనీ పెట్టడానికి ఎటువంటి పర్మిషన్స్ అనుమతులు లేకుండా పెడుతున్నారు అని ఆరోపిస్తూ అధికారులు వచ్చి ఆపమని చెప్పినా ఈ కంపెనీ వారు మమ్మలిని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని మాట్లాడుతున్నారు అని సన్యాసి నాయుడు తెలియ జేశారు.

గ్రామస్థులు ఇక్కడ పొల్యూషన్ లేకుండా బాగా జీవించాలి అంటే ఈ కంపనీ ఇక్కడ పెట్ట కూడదు అని గ్రామ ప్రజలు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు అని అన్నారు.ప్రజలు ఇక్కడ  పశువుల మేపుకుంటు,వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు అని ఇప్పటికే ఇక్కడ ఇళ్లల్లో నివసిస్తున్న వారు  ఫార్మసీటి పొల్యూషన్ వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు అని వాపోయారు.కంపెనీ నిర్మాణం సాగిస్తున్న వారి దగ్గరకు పోలీస్ అధికారులు కూడా వచ్చి వారి దగ్గర పేపర్స్ అవి  తీసుకుని నిర్మాణ పనులు ఆపాలి అని వారికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అని సన్యాసినాయుడు తెలియ జేశారు.అనుమతులు లేకుండా కంపెనీ నిర్మాణం సాగిస్తున్న యాజమాన్యం పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మోటూరి సన్యాసినాయుడు గ్రామస్థులతో కలిసి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి వియ్యపు చిన్నా,స్థానిక నాయకులు,గ్రామస్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...