ఇంటి పన్నులు త్వరగా వసూలు చేయాలి
పెన్ పవర్, వలేటివారిపాలెం
ఇంటి పన్నులు త్వరగా వసూలు చేయాలని ఎంపీడీవో రఫీక్ అహ్మద్ అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేసులు పెరుగుతున్నందున ప్రతి గ్రామంలో పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాబోయే రోజుల్లో వడగాలులు వస్తాయని , వడగాలులపై కూడా అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఇఓఆర్డి పి సుమంత్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment