Followers

కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ లో చేర్చాలి

 కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ లో చేర్చాలి...

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ డిమాండ్.

ఉట్నూర్, పెన్ పవర్

కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని,ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకోవడం లేదని ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మండిపడ్డారు. బుధవారం  ఉట్నూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ముందు చూపు లేక,ప్రస్తుతం  ప్రజా వ్యవస్థ అతలాకుతలం అయ్యిందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా వ్యాధిని వెంటనే ఆరోగ్యశ్రీ లో చేర్చాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ అలసత్వం వల్ల ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజల్లో వారి జీవన విధానం, కోవిడ్ వ్యాధిపై అయోమయం లో ఉంటే, ప్రజా ప్రతినిధులు పలకరించిన పాపాన పోలేరని మండి పడ్డారు. భయం తో ప్రజలు ఉన్న ఆస్థులమ్ముకొని, ప్రయివేటు దవాఖానకు ధారపోసి, వీధిన పడే పరిస్థితి దాపురించిందన్నారు. కనీసం గ్రామాల్లో కరోనా టెస్ట్ లు చేయలేని పరిస్థితి ఉందన్నారు. దీంతో టెస్టుల్లో జాప్యం జరిగి, వ్యాధి తీవ్రత ఎక్కువై ప్రజలు చనిపోయిన సంఘటనలు చూస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చి,ఆదుకోవాలని కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...