ప్రజల దీవెనలు,ప్రేమ, అనురాగంతో నేను కరోనాను జయించాను
నన్ను కరోనా నుండి జయించడానికి నాకు వైద్యులు ముందుగా ప్లాస్మా థెరపీ తప్పనిసరి అన్నప్పటికి,నా సాలూరు నియోజకవర్గ ప్రజలు యొక్క ఆశీస్సులు,అభిమానం, ఆదరణ నన్ను కరోనా రాక్షసి నుండి కాపాడినవి సాలూరు ప్రజల దీవెనలు,ప్రేమ, అనురాగంతో నేను కరోనాను జయించాను.అయితే నాకు కరోనా వలన కలిగిన కలిగిన ఆక్సిజన్ ఇబ్బందులు, ఆయాసం,సైడ్ ఎఫెక్ట్,ఇన్ఫెక్షన్, ఫిజియోథెరపీ,ధ్యానం, మానసిక ప్రశాంతత మరియు వైద్య సేవలు డాక్టర్లు అందిస్తున్నారు. నాకు ఫోన్లు చేస్తున్న వారికి, నాకు ధైర్యం నింపే సందేశాలు ఇస్తున్న వారికి మరియు నా ఆరోగ్యం-ప్రాణరక్షణ కోసం దేవునికి ప్రార్ధనలు చేస్తున్న వారికి నేను తిరిగి జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నందుకు చాలా బాధగా ఉన్నది.నన్ను మరి కొద్ది రోజులు ప్రశాంతంగా మెరుగైన వైద్యం పొందటానికి సహకరించాలని నా ప్రియమైన ప్రజలకు నేను కోరుచున్నాను.
No comments:
Post a Comment