నూతనంగా నిర్మించనున్న చెక్ డ్యాం పనులకు భూమి పూజా...
ఆదిలాబాద్ , పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం కరంజి గ్రామ సమీపంలో రు.1కోటి 30 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న చెక్ డ్యాం నిర్మాణ పనులను శనివారం జడ్పిటిసి సుధాకర్ భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సుధాకర్ మాట్లాడుతు భూగర్భ జలాల పెంపుకు ఈ చెక్ డ్యామ్ లు దోహద పడుతాయని తెలిపారు.వర్షపు నీరు వృధా కాకుండా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మండల ప్రజలు కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆకాటి నరెందర్ రెడ్డి, నాయకులు నరెందర్ యాదవ్, రమేష్ యాదవ్,కుడిమెత సంతోష్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment