Followers

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ...

ఆదిలాబాద్ , పెన్ పవర్

ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్సలు పొందిన పేదలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణానికి చెందిన 13 మంది లబ్ధిదారులకు మంజూరైన సిఏంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పరిధిలోకి రాని చికిత్సలను ప్రైవేటు ఆసుపత్రుల్లో చేయించుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం సి.ఎం.ఆర్.ఎఫ్ ద్వార అండగా నిలబడుతుందని చెప్పారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఆర్ధిక సహాయాన్ని అందించడం ద్వార వారి ఇబ్బందులు దూరం చేస్తున్నట్లు వివరించారు. వైద్య చికిత్సలు చేయించుకున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి అవసరమైన పత్రాలు అందించాలని సూచించారు. లేని యెడల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో  కౌన్సిలర్లు సాయి ప్రణయ్, ఆవుల వెంకన్న, ప్రకాష్, పందిరి భూమన్న, అశోక్ స్వామి, అజయ్, భరత్, తెరాస నాయకులు రామ్ కుమార్ , దమ్మ పాల్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...