ప్రార్థన మందిరాలు, ఆలయాల్లో హైడ్రో క్లోరోక్విన్ శానిటేషన్
పెన్ పవర్, కాప్రా
ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ పరిధిలోని పలు ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం విస్తృతంగా హైడ్రో క్లోరోక్విన్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి స్వయంగా ద్రావణాన్ని పిచికారి చేయడంతో ఆయా ప్రార్థన మందిరాలు, ఆలయాల నిర్వాహకులు, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు ఎంతో ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జమ్మిగడ్డ లోని మసీదులో, విజయ దుర్గ మల్లేశ్వర ఆలయంలో, చర్చి లలో హైడ్రో క్లోరోక్విన్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా రెండోదశ ఉద్ధృతంగా విజృంభిస్తున్న దృష్ట్యా ప్రతి ఒక్కరు స్వీయ క్రమశిక్షణ పాటించాలని సూచించారు. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి కరోనాను ఎదుర్కోవాలని కోరారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టి పి సి సి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, జై జవాన్ కాలనీ అధ్యక్షులు తిరుమలయ్య యాదవ్, బి జె ఆర్ కాలనీ అధ్యక్షుడు ఎస్.కె రహీమ్, నాయకులు ఆల్లురయ్య, ఎండి కరీం, సలీం తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment