Followers

ముంచంగిపుట్టులో స్వచ్ఛంద లాక్డౌన్ అమలు

 ముంచంగిపుట్టులో స్వచ్ఛంద లాక్డౌన్ అమలు

ముంచంగిపుట్టు, పెన్ పవర్

నేటి (సోమవారం) నుంచి స్వచ్ఛంద లాక్ డౌన్ అమలు జరుగుతుంది. ప్రజలు వ్యాపార్లు అధికార్లు సమైక్యంగా లాక్ డౌన్ పాటించాలని నిర్ణయించారు. సోమవారం నుంచి ముంచంగిపుట్టులో అత్యవసర మైన మెడికల్ షాపులు మినహాయించి కిరాణా బట్టలు దుకాణాలు హోటల్ లు ఇతర షాపులను పూర్తి గా మూసివేశారు. రెండో విడత కరోనా తీవ్ర తను కట్టడి చేసేందుకు గ్రామంలో వర్తకులు ప్రజలు అధికార్లు సమావేశం అయ్యి కరోనా అదుపుకు స్వచ్ఛంద లాక్ డౌన్ కు పూనుకున్నారు. శనివారం మండల కేంద్రంలో జరిగే వారపు సంతను రద్దు చేశారు. ఈ రోజు నుంచి గ్రామంలో దుకాణాలు మూతబడ్డాయి. ప్రజల అవసరాల మేరకు రెండు రోజు లకు ఒక సారి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కిరాణా షాపులు తెరుస్తామని వ్యాపార్లు ప్రకటించారు. వైఎస్ఆర్ నాయకుడు మృతి చెందడంతో కలవరం మొదలైంది. ప్రజారోగ్యం దృష్ట్యా వ్యాపార్లు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేందుకు రావడం పై ప్రజలు హర్షం వ్యవస్థ చేస్తున్నారు.మండలంలోని కిలగాడ గ్రామంలో ప్రతీ మూడేళ్ల కు ఒక మారు జురిగే గంగమ్మ జాతర ను రద్దు చేశారు. కరోనా కారణంగా జాతరను నిలిపి చేస్తున్నట్లు కమిటీ వారు ప్రకటించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...