Followers

ఆత్మ బలిదానం చేసుకున్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధికి నివాళులు

 ఆత్మ బలిదానం చేసుకున్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధికి నివాళులు


కూకట్ పల్లి, పెన్ పవర్ 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమొస్తే ఉద్యోగాలు, ఉపాధి వస్తుందని 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రై ఏడూ సంవత్సరాలు అవుతున్నా ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదనే ఆవేదనతో కాకతీయ విశ్వవిద్యాలయంలో మార్చి 26వ తేదీన పురుగుల మందు తాగిన కేయూ విద్యార్థి బోడ సునీల్ నాయక్ చికిత్స పొందుతూ నిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ శుక్రవారం  జేఎన్టీయూహెచ్ మెయిన్ గేట్ దగ్గర జెఎన్టియుహెచ్ బంజారా విద్యార్థి సంఘం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ బోడా సునీల్ నాయక్ ఫోటోకి నివాళులు అర్పించి, ఆత్మ శాంతి కలగాలని దేవుని ప్రార్ధించారు. అనంతరం వారు మాట్లాడుతూ సునీల్ నాయక్ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్సగ్రెసియా మరియు ఒక ఉద్యోగం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలను తక్షణమే ప్రారంభించాలని కోరుతూ ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులులను ప్రభుత్వం ఆదుకోవాలని, రాష్ట్రంలో అన్ని యూనివర్శీటీలను ప్రారంభించి విద్యాసంస్థలలో కోవిడ్ -19 నిబంధనలు అమలు చేస్తూ, కరోన నివారణ చర్యలకు నిధులను  కేటాయించాలని కోరారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని ఈసందర్భంగా డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో  బంజారా విద్యార్థి సంగం అధ్యక్షుడు లకవత్ భాను ప్రకాష్ , ఎస్.ఎఫ్.ఐ నాయకుడు సాయి కిరణ్, కూకట్ పల్లి ఎస్ఎఫ్ఐ సెక్రెటరీ రాజేష్ చౌహాన్, బంజారా సంగం వర్కింగ్ ప్రెసిడెంట్ పత్లోత్ రాజు నాయక్, విజేందర్ నాయక్, అబినాష్, సునీల్ నాయక్, అనిల్, ప్రేమ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...