Followers

వి ఎం ఆర్డీ ఏలో గిరిజన గ్రామాలను చేర్చడం రాజ్యంగా విరుద్ధం

వి ఎం ఆర్డీ ఏలో గిరిజన గ్రామాలను చేర్చడం రాజ్యంగా విరుద్ధం

పెన్ పవర్, విశాఖపట్నం

విశాఖ మెంట్రోరీజీయన్ పరిధిలోకి (విఎంఆర్డీఏ)లో జిల్లాలో ని 9 మండలాల్లోని  నాన్ షేడ్యూల్డ్ గిరిజన గ్రామాలను చేర్చడం రాజ్యాంగ విరుద్దమని ఇది ప్రభుత్వ కేవలం గిరిజనులు భూములును కాజేయడం కోసమే ఈ జివోలును తీసుకు వచ్చిందని గిరిజనులు దీన్ని ఐక్యంగా అడ్డు కోవాలని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయకార్మిసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న పేర్కొన్నారు గురువారం అయిన వీలేకర్లుసమావేశంలో మాట్లాడారు విశాఖ మెట్రో రీజియన్ లోకి పరిధిలోకి 13 గ్రామీణ మండలాలును చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వ జివో లను విడుదల చేసిందన్నరు. విశాఖ మెట్రో రీజియన్ లోకి నాన్ షేడ్యూల్డ్ గిరిజన గ్రామాలను చేర్చడం అంటే రానున్న రోజుల్లో  భూములు కాజేసి గిరిజనులు నోట్లో మట్టికోట్టడ మేనని తెలిపారు ఒక ప్రక్కన నాన్ షేడ్యూల్డ్ గిరిజన గ్రామాలను ఐదవషేడ్యూల్ చేర్పిస్తామని ప్రకటన చేస్తు సంవత్సరం క్రితం గిరిజన సలహా మండలి తీర్మానం చేసిందని మరో ప్రక్కన విఎంఆర్డీఏలో చేర్చడం దుర్మర్గ మైన చర్య అని తెలిపారు. భవిష్యత్తులో పేదలు సాగు చేస్తున్న భూములకూ పట్టాలు ఇవ్వడం కుదరదని పన్నులు బారం పేరుగుతుందని గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి నష్టం కలగడం రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగిపోవడం వంటి అనేక సమస్యలు వస్తాయని తెలిపారు  ఓక్కమాటలో చేప్పాల ఆంటే పట్టణ అభివృద్ధి తో.గ్రామీణ అభివృద్ధిని పోల్ఛడం జరంగుతుందని ఇది పేదలకు గిరిజనులు కు అత్యంత ప్రమాదాన్ని తెచ్ఛి పెడుతుందని వెంటనే ఈ జీవోలు రద్దు చేయాలని డిమాండ్ చేసారు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని రద్దుకు క్రుషి చేయాలని కోరారు. జిల్లాలోని ,నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలన్నింటినీ ఐదవషేడ్యూల్ లో  చేర్చాలని  ఏళ్ల తరబడి గిరిజనులు ఆందోళన చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన గ్రామాలును సైతం  చేర్చడాన్ని వ్వవసాయకార్మిసంఘం తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన జివో లో పేర్కొన్న నాన్ షెడ్యూలు గిరిజన గ్రామాలను పూర్తిగా తోలగించాలని డిమాండ్ చేశారు.  విశాఖపట్నం జిల్లాలో తోమ్మిది మండలాల్లో 113 రెవెన్యూ గ్రామాలు 262 గిరిజన గ్రామాలు లక్షా 60 వేల మంది జనాభా గల ఆదివాసీ గిరిజనులు జీవనం సాగిస్తున్నారని వీరీ బ్రతుకులు ప్రశ్నర్దకంగా మారుతాయని అన్నారు ఇప్పటికే నాన్ షేడూల్డ్ ఏరియా లో గిరిజనులు భూములు అన్ని పట్టణ ప్రాంతాలకు చేందిన ధనవంతులు కాజేసారని ఇప్పుడు గిరిజనులు చేతుల్లో ఉన్నది కేవలం బంజరు భూములేనని వాటిని 99సంవత్సరాలు లీజులు పేరుతో లాక్కుంటున్నారని ఇప్పుడు లో చేర్చిపూర్తిగా గిరిజనులు ను ప్రభుత్వం వెళ్ళగోట్టాలని చూస్తుందని దీన్ని గిరిజనులు తిరష్కారించాలని పిలుపునిచ్చారు. జిల్లా లోని దేవరాపల్లి,చీడికాడ వి మాడుగుల, రావికమతం,రోలుగుంట, గొలుగొండ, నాతవరం, కోటవురట్ల, మండలాల్లో 113 రెవిన్యూ గ్రామాల పరిధిలోని,నాన్ షెడ్యూల్ గ్రామాలన్నీ ఐదవషేడ్యూల్  ఏరియాలో చేర్చాలని గిరిజన శాఖ మంత్రి వర్యులు పుష్ప శ్రీవాణి అధ్యక్షతన రాష్ట్ర గిరిజన సలహా మండలి తీర్మానం చేశారని  నేటికీ సంవత్సరం అవుతున్నా గిరిజన సలహా మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికి అమలు చేయలేదన్నారు. నాన్ షెడ్యూల్ మండలాల్లో గిరిజనులుకు ఏజెన్సీలో వస్తున్న కనీస సౌకర్యాలు దక్కడం లేదన్నారు కానీషం ఐటిడిఎ నిధులు అయిన మైదాన ప్రాంత గిరిజనులు అబివృద్ది కి ఇవ్వడం లేదని స్వతంత్రం వచ్చి 80 ఎళ్ళకు వస్తున్న నేటికి కూడా రోడ్డు, మంచినీరు,ఉపాధి ఉద్యోగాలు వంటి మౌలిక సదుపాయాలుకు నోచుకోలేని దస్థితి ఎర్పడిందని అన్నారు.ఇప్పటికే గిరిజనుల చేతిలో ఉన్న భూములన్నీ గిరిజనేతరుల పరం అయ్యాయని  అన్నారు. అదే విధంగా కోయ్యూరు మండలం లో ఉండీ 5 వ షెడ్యూల్ ఉన్న రెవెన్యూ గ్రామాలును కూడా  చేర్చడాన్ని తప్పు పట్టారు   సరుగుడు చమ్మచింత కురువాడ పొట్టినాగన్నదోరపాలేం గంగపాలెం కేవీ శరభవరం కృష్ణాపురం అగ్రహారం బురదపల్లిఅగ్రహారం ధర్మవరం అగ్రహారం రెవెన్యూ గ్రామాలు అప్పటిలోపరిపాలనా సౌలభ్యం కోసం నాతవరం మండలం లో చేర్చారని కానీ ఆగ్రామాలు ఇప్పటి కి ఐదవషేడ్యూల్  ఏరియా ఉన్నాయని వాటిని కూడా  లో చేర్చడం విడ్డూరంగా ఉందన్నారు  ఐదో షెడ్యూల్ పరిధిలోకి వచ్చె గ్రామాలకు ఎల్ టి ఆర్ కేసులు 1/70 చట్టం అమల్లో ఉన్నాయని ఈ ప్రాంతంలో భూములు అమ్మకాలు కొనుగోలు సదరుచట్టానకీలోబడి ఉంటాయని  కాని రాష్ట్రప్రభుత్వం ఏజెన్సీ గ్రామాల్లో కూడా అభివృద్ధి పేరుమీద గిరిజన భూములను వి ఎం ఆర్ డి పరిధిలోకి తీసుకురావడం అంటే రియల్ ఎస్టేట్ పేరుమీద గిరిజన భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తుందని అర్దమౌతుంద అన్నారు ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వెంటనే నాన్ షేడూల్డ్ గిరిజన గ్రామాలకు మినహాయింపు ఇవ్వాలని లెదంటె ప్రజాఉద్యమాలు తప్పవని వెంకన్న హెచ్చరించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...