డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణనికి భూమి పూజా...
నార్నూర్, పెన్ పవర్
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల 12 మంది విలేకరులకు12 తెలంగాణ కెసిఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేశారు. రెండు పడకల ఇల్ల నిర్మాణం కొరకు సోమవారం ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు,డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లె లతో కాలసి భూమి పూజా చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి నిత్యం ప్రజల సమస్యలను వెలికితీసి వార్తలు సేకరించి ప్రచురితం చేసిన విలేకర్ల సౌకర్యార్థం కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పత్రికా విలేకరుల అభివృద్ధి కోసం రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కనక మోతుబాయ్, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, ఎంపీటీసీ పరమేశ్వర్,స్థానిక డైనమిక్ సర్పంచ్ బానోత్ గజానంద్,గుండాల సర్పంచ్ శ్రీరామ్,ఫాక్స్ డైరెక్టర్ దుర్గే కాంతారావు,మేడల్ స్కూల్ చైర్మన్ రాథోడ్ సుభాష్,రమేష్,సురేష్ ఆడే, మహేందర్ దుర్గే, కోరేలా మహీందర్,మాణికరావు, మోతే రాజన్న, సత్తర్, అయమద్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసినందుకు నార్నూర్ ఉమిడీ మండల విలేకరులు నాయకులకు, కెసిఆర్ కు అత్యధిక కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment