అగ్నిమాపక సిబ్బంది సేవలు అనిర్వచనీయం: ఎమ్మెల్యే కేపి వివేకానంద్
జీడిమెట్ల, పెన్ పవర్అగ్నిమాపక వారోత్సవాల గోడపత్రికను విడుదల చేసిన ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద.. తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ సేవల జీడిమెట్ల ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను సోమవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన నివాసం వద్ద అగ్నిమాపక అధికారులు, సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది సేవలు అనిర్వచనీయమని అన్నారు. అగ్ని ప్రమాదాలు, విష వాయువుల వ్యాప్తి మొదలైన సంఘటనలు జరిగినప్పుడు వీరి సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కూకట్ పల్లి సైదులు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జీడిమెట్ల వి.సుభాష్ రెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కూకట్ పల్లి వై.కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment