Followers

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కి వినతి

 వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కి వినతి

మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు

పెద్దపల్లి , పెన్ పవర్

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కి మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు విన్నపం. అయ్యా రాష్ట్ర వైధ్య ఆరోగ్య శాఖ మంత్రి గారూ మంథని ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ టెస్టులు చేయడానికి ల్యాబ్ అసిస్టెంట్ నియామకం మరియు డిజిటల్ ఎక్స్ రే మరియు మంథని నియోజకవర్గంలో ఐసోలేషన్ వార్డులో ఆక్సీజన్, వెంటిలేటర్లు ఏర్పాటు చేయగలరని మాతా శిశు సేవలు పున:ప్రారంభమై నందున మంథని నుండి పెద్దపల్లి గోదావరిఖని లో పని చేస్తున్న 16 మంది స్టాఫ్ నర్సుల డిఫ్యుటేషన్ రద్దు చేసి మంథనికి మాత శిశు ఆసుపత్రికి వెంటనే కేటాయించ గలరని, మంథని మరియు మహాదేవపూర్ ఆసుపత్రిలో రోగులకు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎక్కువ సంఖ్యలో కోవిడ్ టెస్టులు మరియు కరోనా టీకాలను మంథని పట్టణంలో తగినన్ని అందుబాటులో ఉంచి ముందస్తు జాగ్రత్తగా ఇతర ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తూ.. భౌతిక దూరం పాటిస్తూ.. అందరికి అందజేయాలని, మహాదేవపూర్ ఆసుపత్రిలో ఫిజిషియన్ డాక్టర్ ను మరియు ఐసోలేషన్ వార్డు ఏర్పాటు కోసం వైద్యశాలలో సెంట్రల్ ఆక్సిజన్ సప్లై  ఏర్పాటు చేయాలని, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు వినతి పత్రాన్ని  మంత్రి ఈటల రాజేందర్ కార్యాలయానికి పంపించి కోరారు. అదే విధంగా పెద్దపల్లి మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్లకు మరియు జిల్లా వైద్యాధికారులకు కూడ (డిఎమ్అండ్ఎచ్ఓ) కీ మెయిల్ ద్వారా వినతి పత్రాన్ని పంపి ఈ సందర్భంగా ఆయన కోరడం జరిగింది.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...