కరోనాను సమిష్టిగా ఎదుర్కోవటానికి సర్పంచ్ లందరూ సహకరించాలి
పెన్ పవర్, ఆలమూరు
కరోనాను పూర్తి స్థాయిలో ఎదుర్కోవటానికి మండలంలో గల పధ్ధెనిమిది గ్రామాల సర్పంచ్లు వార్డు సభ్యులందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆలమూరు ఎంపీడీవో జేఏ ఝాన్సీ, ఏఎంసీ చైర్మన్ తమ్మన సుబ్బలక్ష్మి పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన ఆలమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన సర్పంచ్ వార్డు సభ్యుల ఒక్క రోజు శిక్షణా తరగతులు ఎంపీడీవో అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాల్లో కోవిడ్ ను పూర్తిగా నియంత్రించేందుకు..కోవిడ్ వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత మీపై ఉందని, ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని తెలిపారు.
వీధుల్లో, ఆరుబయట మాస్క్లు లేకుండా తిరిగి వారిపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అది సర్పంచ్లు వల్లే సాధ్యమవుతుందని తెలిపారు. ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో కరోనాను సమిష్టిగా ఎదుర్కోవటానికి సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రజాప్రతినిధుల సహకారాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కరోనా సెకండ్ వేవ్ వలన మానవాళి అనేక ఇబ్బందులు పడుతున్నారని దానిని కట్టడికి తీసుకోవలసిన చర్యలపై ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో వీడియోలతో (పవర్ ప్రజెంటేషన్) వివరించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కోవిడ్ నియంత్రణకు తగు జాగ్రత్తలు పాటించి అధికారులకు సహకరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ తమ్మన సుబ్బలక్ష్మి శ్రీనివాస్, ఈఓపీఆర్డీ రాజ్ కుమార్, పధ్ధెనిమిది గ్రామాల సర్పంచ్లు, వార్డు సభ్యులు అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment