Followers

వ్యాక్సిన్ కోసం వచ్చే వారికి ఇబ్బంది లేకుండా చూడండి

 వ్యాక్సిన్ కోసం  వచ్చే వారికి ఇబ్బంది లేకుండా చూడండి 

రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయండి.

నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి.

తార్నాక,  పెన్ పవర్

తెలంగాణ రాష్ట్రంలో కరోణ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోణ టెస్టులు, వ్యాక్సినేషన్ కోసం  వచ్చే ప్రజలకు ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి సూచించారు. సోమవారం తార్నాక లాలాపేట్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎక్కువ స్థాయిలో రావడంతో రద్దీ ఏర్పడిందని తగు చర్యలు చేపట్టాలని డిప్యూటీ మేయర్ దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. స్పందించిన ఆమె వెనువెంటనే ఆస్పత్రికి వెళ్లి పరిశీలించారు. అక్కడి వైద్యులతో మాట్లాడంతో వారు  కిట్స్ సకాలంలో రాకపోవడం లేదని సమాధానం చెప్పడంతో డిప్యూటీ మేయర్ డి ఎం హెచ్ వో తో వ్యాక్సిన్ త్వరగా పంపాలని కోరారు. దీనితో వెనువెంటనే వ్యాక్సిన్ రావడం జరిగింది. ఒకేసారి ప్రజలు  పెద్ద సంఖ్యలో రావడంతో వ్యాక్సిన్ కొరత ఏర్పడిందని డాక్టర్లు డిప్యూటీ మేయర్ కు సూచించారు. అనంతరం  డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ కోసం ఎక్కువ సంఖ్యలో ప్రజలు వస్తున్నారని దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ఆసుపత్రి సిబ్బందికి, ఇతర అధికారులకు సూచించినట్టు తెలిపారు. ప్రతిరోజు టోకెన్ల ద్వారా 50 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నారని ఎక్కువ సంఖ్యలో ప్రజలు రావడంతో వ్యాక్సిన్ కొరతా ఏర్పడుతుందన్నారు. ప్రతి రోజు ఏ సమయం నుండి వ్యాక్సిన్ ఎంతమందికి ఇవ్వడం జరుగుతుందో ఆస్పత్రి వద్ద బోర్డు ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...