Followers

కరోనా టెస్ట్ క్యాంపు ను సందర్శించిన స్పెషలాఫీసర్ బాలరాజు

కరోనా టెస్ట్ క్యాంపు ను  సందర్శించిన స్పెషలాఫీసర్ బాలరాజు

 43 మందికి కరోనా టెస్టులు 7గురికి పాజిటివ్.

నెల్లికుదురు, పెన్ పవర్

 మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని శ్రీ రామగిరి గ్రామంలో మంగళవారం నెల్లికుదురు పిహెచ్సి ఆధ్వర్యంలోకరోనా టెస్ట్ లు  నిర్వహించారు.43 మందికికరోనా టెస్టులు  చేయగా 7గురికి పాజిటివ్ వచ్చింది.కాగా స్పెషల్ ఆఫీసర్ బాలరాజు సర్పంచ్ డొనికెన జ్యోతిశ్రీనివాస్ గౌడ్ తో కలిసి కరోనటెస్టుల కేంద్రంతో పాటు ఐసోలేషన్ లో ఉన్న గృహాలను సందర్శించి  ధైర్యంగా ఉండాలనిబాధితులకు  సూచించారు.బయటికి వెళ్ళకూడదన్నారు.ఏమైనా అవసరమైతే గ్రామపంచాయతీ వారు సరఫరా చేస్తారనిప్రత్యేక అధికారి బాలరాజు వారికి  తెలిపారు.కాగా గతంలో మరో ఏడుగురు కరోనా పాజిటివ్ తో హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మాధరి  ప్రశాంత్ ఎ ఎన్ ఎమ్ యశోద,ఆశా వర్కర్లు సునీత, రాణి, విఆర్ఏ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...