భార్యలను చిత్రహింసలు పెట్టిన కేసులో భర్త, అత్త అరెస్టు
చింతూరు మండలం లోని చట్టి గ్రామపంచాయతీ పరిధిలో చట్టి గ్రామంలో కళ్యాణం వెంకన్న అతని తల్లి మారమ్మ లను సోమవారం అరెస్టు చేసినట్లు డి.ఎస్.పి ఖాదర్ బాషా పత్రికా విలేకరుల సమావేశంలో సోమవారం తెలిపారు వివరాల్లోకి వెళితే నిందితుడు కళ్యాణం వెంకన్న అతని భార్యలు సుమిత్ర జయమును అనుమానిస్తూ శారీరకంగా చిత్రహింసలకు గురి చేయడం జరిగింది ఈ మేరకు 16వ తేదీ తమకు భార్యలైన జయమ్మ ఫిర్యాదు చేశారని డిఎస్పీ తెలిపారు చిత్రహింసలు చేయడమే కాకుండా చేసిన చిత్ర హింసలను వీడియో ద్వారా వైరల్ చేసినందుకు అతనిని తల్లిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు 44 బై 2021 307 326 323 494 498 బై( ఏ) 506 509 34 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు ఈ కేసుకు సంబంధించిన వీడియోలను ఇతరులకు ఫార్వర్డ్ చేసిన కేసు నమోదు చేస్తామన్నారు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు డిజిపి ఆధ్వర్యంలో ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు 24 గంటలు అందుబాటులో ఉంటామని చెప్పారు మహిళలు ఎవరైనా నిర్భయంగా పోలీస్ స్టేషన్ కి వచ్చి తమకు జరిగిన అన్యాయం ఏమైనా ఉంటే ఫిర్యాదు చేయుచున్నారు ఈ కేసులో ముద్దాయిలు ఇద్దర్ని రిమాండ్ కి రంపచోడవరం తరలిస్తున్నట్లు చెప్పారు .ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చింతూరు C.I, యూవకుమార్, S,I సురేష్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment