ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం
తార్నాక , పెన్ పవర్శ్రీరామనవమిని పురస్కరించుకుని తార్నాక డివిజన్ లోని శాంతినగర్ మరియు లాలాపేట్ లో సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవానికి డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాముడు మరియు సీత దేవి యొక్క పవిత్ర సంబంధం, తరాల తరువాత తరానికి స్ఫూర్తినిస్తూ ఉంటుందని ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వివేక్ రెడ్డి, నాగేశ్వరరావు, లక్ష్మారెడ్డి, శ్రీధర్, వేణు గోపాల్, అలీ, బాబు, ఆలయాల కమిటీ సభ్యులు తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment