అక్రమ కట్టడాల కూల్చివేతలో నిమగ్నమై వుంది
విశాఖ తూర్పు, పెన్ పవర్
మంగళవారం ఉదయం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు,మాజీ ఎం.ఎల్.ఏ,పి.విష్ణుకుమార్ రాజు పత్రిక విలేఖరుల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా పి.విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని,రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా కట్టడికి సంబంధించిన చర్యలను చేపట్టకుండా అక్రమ కట్టడాల కూల్చివేతలో నిమగ్నమై కరోనా వ్యాప్తికి కారణమవుతుందని అన్నారు.ఇటీవల రాష్ట్రప్రభుత్వం వాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి కోవీషీల్డ్ డోసులు మాత్రమే ఇచ్చారని,కొవాక్సీన్ మాత్రం ఎవరికీ అందజేయలేదని అన్నారు.అదేవిధంగా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆసుపత్రులకు వెళ్లి టెస్టులు చేయించుకున్న తరువాత నాలుగైదు రోజులకు గానీ ఆ టెస్టు రిపోర్టులు రానటువంటి పరిస్థితి ఏర్పడటం వలన, ఈలోపు టెస్టు చేయించుకున్న వ్యక్తికీ గానీ కరోనా ఉన్నట్లయితే మరికొంతమందికి వ్యాపించే అవకాశం ఉన్నదని తెలిపారు.కావున కరోనా టెస్టుల ఫలితాలు వీలైనంత త్వరగా వెల్లడించి రోగులు తగు జాగ్రత్తలు తీసుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ఇటీవల విధించిన నైట్ కర్ఫ్యూ రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 05:00 గంటల వరకు ఏర్పాటు చేయడం వలన పోలీసులకు ఇబ్బంది కల్గించడమే తప్ప, నైట్ కర్ఫ్యూ వలన ఎవరికీ పెద్దగా ఉపయోగం లేదని అన్నారు.నైట్ కర్ఫ్యూ ను రాత్రి 07:00 గంటల నుండి అమలు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు.ఈ సందర్భంగా బీజేపీ విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సందర్భంలో రోగులకు సరిపడా బెడ్స్ అందుబాటులో లేక చాలామంది ఆసుపత్రుల బయటనే ప్రాణాలు విడుస్తున్నారని విచారం వ్యక్తం చేసారు.ఆసుపత్రులలో ఉన్నటువంటి వెంటిలేటర్స్ తక్షణమే మరమ్మత్తులు చేసి రోగులకు అందుబాటులోనికి తీసుకురావాలని కోరారు. ప్రస్తుతమున్న ప్రమాదకర పరిస్థితులలో అన్ని రాష్ట్రాలలోను పరీక్షలను రద్దు చేసినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తూ పరీక్షలను యధావిధిగా నిర్వహిస్తామని ప్రకటించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా పరీక్షలను వాయిదా వేయాలని తెలిపారు.
No comments:
Post a Comment