Followers

అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా

 అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా...

 ఆదిలాబాద్,  పెన్ పవర్ 

తెలంగాణ రాష్ట్రం లో నిరుద్యోగ సమస్యల పై సునిల్  నాయక్ ఆత్మహత్యకు  కు నిరసనగా శనివారం   బిజెపి, బీజేవైఎం,అన్ని మోర్చా ల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మట్లాడుతూ కెసిఆర్ పాలన వలన, కెసిఆర్ మొండి వైఖరి వల్ల తెలంగాణలో నిరుద్యోగులు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకోవడం ప్రారంభమైందని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటుందని, చనిపోయిన సునీల్ నాయక్  కుటుంబానికి కోటి రూపాయలు నష్ట పరిహారం, అతని ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితి పెంచి, పి.ఆర్.సి. ఇవ్వడంతో  ఇవ్వడంతో మొత్తం తెలంగాణ బాగు పడినట్లు భావించవద్దని, మళ్లీ ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులకు ప్రభుత్వం నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు వేసే అంత వరకు ఉద్యమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులను కోరారు..ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందం, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు శివ గౌడ్, బిజెపి పట్టణ అధ్యక్షుడు లాలా మున్న,బిజెపి నాయకులు జోగు రవీ,లోక ప్రవీణ్, సమ రవి,ఆకుల ప్రవీణ్, సచిన్,సాయి, దయాకర,ధోని జ్యోతి,దత్తు,తదితురులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...