కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
20 టన్నుల బ్లీచింగ్ అందజేత
దాత ఇంటూరి హరిబాబు ను అభినందించిన ఎమ్మెల్యే
పెన్ పవర్, కందుకూరు
కరోనా రెండవ దశ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక స్పృహతో మెలగాలని స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద నియోజకవర్గంలోని ఐదు మండలాలకు, పురపాలక సంఘంకు 20 టన్నుల బ్లీచింగ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ 19 మొదటి దశలో 120 టన్నులు బ్లీచింగ్ అందజేశామని గుర్తు చేశారు. కొవిడ్ 19 విరాళాల నుండి సమర్థవంతంగా ప్రతి ఒక్కరూ సహకరించడం వల్ల కలిసికట్టుగా బయటపడ్డామని అన్నారు. ఇప్పుడు రెండో దశ లో ఊహించని విధంగా వేగంగా విస్తరిస్తు అన్ని గ్రామాల్లో కూడా వేగవంతంగా కేసులు నమోదు కావడంతో ఐదు మండలాల ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్ బ్లీచింగ్ కావాలని అడగడంతో సుమారు 4.20 లక్షల రూపాయలతో బ్లీచింగ్ అందజేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ బ్లీచింగ్ కు అయ్యే ఖర్చులో 4.20 లక్షలలో 2.10 లక్షల రూపాయలు అందజేసిన వలేటివారిపాలెం మండల జెడ్పిటిసి అభ్యర్థిని, బడేవారిపాలెం గ్రామ నివాసి ఇంటూరి హరిబాబు, భారతి దంపతులు ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు. ఆపద సమయంలో తోటివారు బాగుండాలనే దృక్పథంతో ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చూపించిన హరిబాబు దంపతులకు ఎమ్మెల్యే మహీదర్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఈ దశలో మరణాలు కూడా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రజలు సహకరించి మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. బ్లీచింగ్ ఇంకా కావాలని అధికారులు కోరుతున్నారని మరో వారం రోజుల లోపల 55 టన్నులు ఇస్తామని తెలిపారు. ఆర్థిక సహాయ కార్యక్రమాలతో పాటు ప్రజలు సామాజిక స్పృహతో మెలిగినప్పుడే కరోనాను నియంత్రించగలమని అన్నారు. బ్లీచింగ్ కు సహకరించిన ఇంటూరి హరిబాబు కు అధికారులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్, కందుకూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు ఎంపీడీవోలు విజయ శేఖర్, రఫిక్ అహ్మద్, మాలకొండయ్య, వెంకటేశ్వర్లు, రవికుమార్, ఈఓ ఆర్డి రఘునాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment