లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ పిల్లలకు బుక్స్ పంపిణీ
సమాజానికి ఆదర్శం లైన్స్ క్లబ్ ,,,సర్పంచ్ గణపారపు సరిత
కేసముద్రం, పెన్ పవర్మారుమూల ప్రాంతాల్లో పేద విద్యార్థులకు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని సమాజానికి ఎంతో ఆదర్శమని ఇంటికన్నె సర్పంచ్ గణపారపు సరిత అన్నారు. కేసముద్రం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటికన్నె జడ్పీ హైస్కూల్ లో గురువారం 24 మంది పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు పుస్తకాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. నిరుపేద విద్యార్థులకు పుస్తకాలను ఇచ్చినందుకు లయన్స్ క్లబ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్, ఎస్ఎంసీ చైర్మన్ అంబాల సృజన, క్లబ్ కోశాధికారి చింతా కరుణాకర్, సభ్యులు బోగోజు నాగేశ్వరాచారి, హెచ్ఎం ఎల్.పద్మజ, ఉపాధ్యాయులు కె.నర్సింగరావు, పి.సతీష్ కుమార్, జయకృష్ణ, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment