అమ్మాపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు అవస్థలు
సన్న వడ్లు కొనుగోలు చేయకా, రోజుల తరబడి నిరీక్షణ.
తాలూ, తేమ పేరుతో రైతులను మోసం చేయొద్దు.
మిల్లు యజమానుల పక్షాన నిలబడి, మాపొట్ట కొట్టొద్దు.
సన్న వడ్లను కొనుగోలు చేసి,మాకు న్యాయం చేయాలని, అమ్మాపురం గ్రామ రైతుల ఆవేదన.
తొర్రూరు, పెన్ పవర్
ధాన్యం కొనుగోలు కేంద్రంలో సన్న వడ్లను తీసుకోవడం లేదని, ధాన్యం బాగాలేదని తాలు పేరుతో రైతులను మోసం చేయొద్దని, మిల్లు యజమానులు పక్షాన కొనుగోలు కేంద్రాలను అధికారులు నిలబడి, వారికి లాభాలను చేకూర్చుకుంటూ రైతుల పొట్ట కొట్టవద్దని, రైతులు ఆరోపిస్తూ... ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని ఆమ్మాపురం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో సన్న వడ్లు (సన్నలు) తీసుకోవడం లేదని, రైతులు మండి పడ్డారు.ఈ సందర్భంగా రైతులు మార్క రాములు గౌడ్, మాచర్ల శంకరయ్య గౌడ్, మంగ్యా నాయక్ లు మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రానికి సన్న ధాన్యం తీసుకొచ్చి, పది రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, వారు ఆవేదన వ్యక్తం చేశారు. సన్న ధాన్యాన్ని మీ వాహనంలో మీరే మిల్లు దగ్గరికి తీసుకు వెళ్ళాలని, కొనుగోలు కేంద్రం వారు అంటున్నారని, రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రంలో క్వింటాకు ఒక కిలో కటింగ్ ఉంటుందని, అన్నారు. కాని మిల్లుకు వెళ్లిన తర్వాత 2 నుంచి 3 కిలోలు తరుగు తీస్తున్నారని,శాంపిల్ తీసుకెళ్లినప్పుడు మాత్రం పరవాలేదు బాగానే ఉంది. తీసుకురండి అంటున్నారు. కాని అక్కడికి వెళ్ళిన తర్వాత 2 నుంచి 3 కిలోలు తరుగు తీయడం ఏమిటని, రైతులు ప్రశ్నిస్తున్నారు.సన్నలు పెట్టమని ప్రోత్సహించిన ప్రభుత్వమే సన్న వడ్లను తీసుకోవడం లేదని, రైతులను మోసం చేయడం ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక క్వింటాకు 35 రూపాయలు కూలి ఉంటే 40 నుంచి 50 రూపాయలు తీసుకుంటున్నారన్నారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, మిల్లుల యజమాన్యం లాభపడే విధంగా కాకుండా రైతులకు నష్టం జరగకుండా రైతుల పక్షాన నిలబడి రైతులు నష్టపోకుండా చూడాలని వారు కోరుకుంటున్నారు.
No comments:
Post a Comment