Followers

మహారాజ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో మరణాలు..

 మహారాజ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో మరణాలు..

సాలూరు, పెన్ పవర్

విజయనగరం లో మహారాజా హాస్పిటల్ లోని ఆదివారం జరిగిన మరణాలు ఆక్సిజన్ కొరతతో మరణించారని డాక్టర్ చెబుతుంటే,  కాదు కరోనాతో  చనిపోయారని ప్రభుత్వం ప్రకటిస్తుంది,ఇదేమి విడ్డూరం అని మాజీ ఎమ్మెల్సీ మరియు పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ప్రభత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటి వరకు        మరణించినవారి సంఖ్యను కూడా  దృవీకరించకుండా ప్రజలను  మోసం చేస్తున్న జగన్  ప్రభుత్వంను ప్రజలు ఇంకెలా నమ్మలో అర్ధం కావడం లేదుని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే జగన్ ప్రభుత్వం చోద్యం చూస్తుందిని విమర్శించారు. విజయనగరం మహారాజా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కొందరు మృతి చెందడంపై దిగ్భ్రాంతికి గురయ్యానునాని ఆవేదన చెందారు. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే.. ప్రతిపక్షంలో ఉండి ప్రతిరోజూ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరిస్తున్నా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందిని అన్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, మందులు అందక ప్రజలు నరకయాతన పడుతున్నారు, సకాలంలో ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే జగన్ చోద్యం చూస్తున్నారు అని ఎద్దువా చేశారు. ఆక్సిజన్ కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందిని, మహారాజ ఆస్పత్రి ఘటన బాధాకరం.. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలిని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి అయిన ఆక్సిజన్ ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. దానిపై ప్రభుత్వం పట్టించుకోలేదు, ఆక్సిజన్ ను బ్లాక్ లో అమ్ముకుంటున్న కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు, ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి. ఇప్పటికైనా పారాసెట్ మాల్, బ్లీచింగ్ పౌడర్ అని కబుర్లు ఆపి, ప్రజల ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ పెట్టాలిని,  బెడ్లు, ఆక్సిజన్, మందుల కొరత లేకుండా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలిని కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...