మాస్కులు ధరించకపోతే కఠిన చర్యలు తప్పవు
మండల కేంద్రం వెంటనే లోని వ్యాపారస్తులకు, గ్రామస్తులకు, వాహనదారులకు ఆండ్ర ఎస్ ఐ షేక్ శంకర్ మాస్కుల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారస్తులు, వినియోగదారులు, వాహనదారులు మాస్కులు ధరించి కపోతే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశాల మేరకు మాస్కుల పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మాస్కులు ధరించకపోతే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉందని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మాస్కులు ధరించాలని ఆయన సూచించారు. మాస్కులు ధరించడం తో పాటు బహుదూరం పాటించాలని, ప్రజలు ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకో కూడదని, అవసరమనుకుంటే దూరంగా ఉండి మాట్లాడాలని ఆయన పేర్కొన్నారు.
No comments:
Post a Comment