నియోజకవర్గ పరిధిలో అదనంగా టీకా.. పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు ఎమ్మెల్యే ఆదేశం..
కుత్బుల్లా పూర్, పెన్ పవర్
నియోజకవర్గం పరిధిలో అదనంగా కరోనా టీకా మరియు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ జిల్లా ఉప వైద్యాధికారికి ఆదేశించారు.. బుధవారం నియోజకవర్గ పరిధిలోని షాపూర్ నగర్, గాజులరామారం మరియు సూరారంలోని ప్రభుత్వ ప్రాధమిక ఆసుపత్రులను జిల్లా డిప్యూటీ వైద్య అధికారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అక్కడి వైద్య సిబ్బందితో మరియు అక్కడికి చికిత్స కోసం వచ్చిన ప్రజలతో ముఖాముఖీ మాట్లాడారు, కరోనా నేపథ్యంలో రోగులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు, అనంతరం వారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారులు తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి తాను ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే వివేకానంద అధికారులకు భరోసానిచ్చారు,అనంతరం నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్ మున్సిపాలిటీ, కొంపల్లి మున్సిపాలిటీ లలో మరియు జిహెచ్ఎంసీ పరిధిలో అదనంగా కరోనా టీకా మరియు పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లి వాటి ఏర్పాటుకు కృషి చేస్తానని నియోజకవర్గంలోని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో కార్పొరేటర్లు రావుల శేషగిరి, మంత్రి సత్యనారాయ ణ, జిల్లా వైద్య అధికారి ఆనంద్, డా.నిర్మల, డా.నవనీత, డా.మమతా, డివిజన్ అధ్యక్షులు సురేష్ రెడ్డి, విజయ్ రామి రెడ్డి, ఇంద్రసేనా గుప్తా, శేఖర్ రావు, అడపా శేషు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment