ఎంపీటీసీ, జెడీపీటీసీ ఎన్నికల వివరాలను శనివారం వెల్లడించిన జిల్లా కలెక్టర్
విజయనగరం,పెన్ పవర్
జిల్లాలో 34 జడ్పీటీసీ స్థానాలకి గాను 3 స్థానాలు ఏకగ్రీవం కాగా, 31 స్థానాలకి ఈనెల 8 న ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలకి 129 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి 31మంది, టీడీపీ నుంచి 28, కాంగ్రెస్ నుంచి 25, బీజేపీ నుంచి 14, బీఎస్పీ నుంచి 4, జనసేన 10 మంది, సీపీఎం నుంచి 3, స్వతంత్రులు 14 మంది పోటీలో ఉన్నారు.జిల్లాలో 549 ఎంపీటీసీ స్థానాలకు గాను, 55 స్థానాలు ఏకగ్రీవం కాగా, 494 స్థానాలకి ఎన్నికలకి జరగనున్నాయి. ఇందులో ఒక స్థానానికి ఏక గ్రీవంగా ఎన్నికైన అభ్యర్థి మరణించి నందున ఆ స్థానంలో కూడా ఎన్నిక జరగనుంది. ఈ మొత్తం స్థానాలకి 1189 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి 491మంది, టీడీపీ నుంచి 453, కాంగ్రెస్ నుంచి 29, బీజేపీ నుంచి 34, బీఎస్పీ నుంచి 12, జనసేన 24 మంది, సీపీఎం నుంచి 20, సీపీఐ నుంచి ఇద్దరు, స్వతంత్రులు 123 మంది పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు మృతి చెందిన కారణంగా 8 స్థానాలకు ఎన్నికల వాయిదా వేయడం జరిగింది.ఈ ఎన్నికల కోసం 1879 పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేసాం. ఈ నెల 8 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 10 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమౌతుంది. భద్రతా దృష్ట్యా 213 సెన్సిటివ్, 183 హైపర్ సెన్సిటివ్, 99 troublesome కేంద్రాలను గుర్తించారు. మండల కేంద్రాల్లోనే ఓట్లు లెక్కింపు జరుగుతాయి. జిల్లాలో సాధారణ ఎన్నికల పరిశీలికులుగా సీనియర్ ఐఏఎస్ అధికారి కాంతి లాల్ దండే వ్యవహరించనున్నారు. ఎన్నికల సామగ్రి, సిబ్బందిని తరలించడానికి 218 బస్ లు, 214 క్యాబ్ లు, 161 కార్లు వినియోస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రజలు, రాజకీయ పార్టీలు ఎలా సహకారం అందించారో అలాగే ఈ ఎన్నికలకి కూడా సహకరించాలని విజ్ఞప్తి. శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసాం.
No comments:
Post a Comment