కాణిపాకం ఆలయంలో కరోనా కలకలం ఐదు మందికి పాజిటివ్ నిర్ధారణ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో పని చేసే ఐదు మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆలయ అధికారులు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా విలయ తాండవం చేస్తుంది ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో భాగంగా కాణిపాకం ఆలయంలో పనిచేసే ఐదు మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆలయ సిబ్బంది భక్తులు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విఘ్న నాయకుడైన గణనాథుని దర్శనార్థం ప్రతిరోజు దేశ నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. రాష్ట్రంలో జిల్లాలో కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ఆలయం వద్ద కరోనా నివారణ చర్యలు చేపట్టాల్సిన ఆలయ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో భక్తులు ఆలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో పనిచేసే అధికారులు సిబ్బంది, అర్చకులు, వేదపండితులకు గురువారం నుంచి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు మూడు రోజులపాటు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఇతర అర్చకులకు ముగ్గురు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా రిపోర్టులు వచ్చినట్లు తెలుస్తోంది. మరికొంతమంది సిబ్బందికి రిపోర్టులు రావాల్సి ఉంది పరీక్షలు చేయించుకున్న సిబ్బంది అర్చకులు, వేదపండితులు రిపోర్టులు వస్తే మరింత మందికి కరోనా పాజిటివ్ వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ఉన్నతాధికారులు కరోనా నివారణకు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇటువంటి పరిస్థితు లు నెలకొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలయంలో భక్తుల మధ్య దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టకపోవడం అధిక సంఖ్యలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతించడం వంటి ప్రజల వల్ల ఆలయంలో కరోనా వ్యాపించినట్లు తెలుస్తోంది. వ్యాపార ధోరణి లో ఆలయ ఆదాయమే పరమావధిగా పెట్టుకొని ఆలయ ఉన్నతాధికారులు కరోనా నివారణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కాణిపాకంలో భారీగా వ్యాప్తి చెందుతున్నట్లు భక్తులు స్థానికులు ఆరోపిస్తున్నారు.
No comments:
Post a Comment