సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దంపతులు
గోపాలపట్నం, పెన్ పవర్
విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రిడా శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకొన్న మంత్రి దంపతులకు ప్రేత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో సింహాచలం బోర్డ్ సభ్యులు, స్థానిక నాయకులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment