Followers

జగన్ ప్రభుత్వంలో మహిళలకే ప్రాధాన్యత

 జగన్ ప్రభుత్వంలో మహిళలకే ప్రాధాన్యత

నర్సీపట్నం, పెన్ పవర్ 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకే అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మహిళలకు సున్నా వడ్డీ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  మెప్మా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డ్వాక్రా మహిళలతో కలిసి ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వీక్షించారు. ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించిన తర్వాత జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి,  నవరత్నాల ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారని తెలిపారు.  ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.  చట్టసభల్లో గాని, సంక్షేమ పథకాలలో గాని మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో 5880 సంఘాలకు 5.33 కోట్లు జమ చేశారని వివరించారు. గత ప్రభుత్వంలా కాకుండా,  ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ కూడా జరుగుతుందని గుర్తు చేశారు.  ఇటువంటి ముఖ్యమంత్రికి అండగా నిలబడి పథకాలు కొనసాగేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి రెండవ దశలో విజృంభిస్తున్నందువల్ల, ఈ బృహత్తర కార్యక్రమాన్ని సాదాసీదాగా జరుపుకోవాల్సి వస్తుందన్నారు. వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత వైయస్ జగన్ కి దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల వలె వేధింపులకు గురి చేయకుండా, ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అనంతరం డ్వాక్రా సంఘాలకు ముఖ్యమంత్రి ప్రోసిడింగ్ పేపర్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి,  వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, మున్సిపల్ కమిషనర్ కనకారావు, వైసిపి సీనియర్ నాయకుడు చింతకాయల సన్యాసిపాత్రుడు,  పట్టణ వైసిపి కౌన్సిలర్లు, నాలుగు మండలాల పార్టీ అద్యక్షులు,  మెప్మా అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...