పోలీసు అధికారులకు,సిబ్బందికి వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ
వనపర్తి,పెన్ పవర్ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను తరిమికొట్టేందుకు ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కోవిడ్ వ్యాక్సిన్ పోలీసుశాఖలో ప్రతి ఒక్కరు వేసుకునేందుకు ముందుకు రావాలని వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వ రావు కోరారు. జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాలులో వనపర్తి జిల్లా పరిధిలోని అనుభవజ్ఞులైన వైద్యాధికారులచే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడుతున్న అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. అదేవిధంగా విధులు నిర్వహించే ప్రతి పోలీసుఅధికారి, సిబ్బంది అందరు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి కె.అపూర్వరావు కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. కోవిడ్ నియంత్రణలో ఫ్రంట్ వారియర్స్ గా విధులు నిర్వహిస్తున్నారని వనపర్తి జిల్లా పరిధిలోని పోలీసు అధికారులతో పాటు సిబ్బంది, హోంగార్డ్స్ సిబ్బందికి వ్యాక్సిన్ వేయించడం జరిగిందని అన్నారు. జిల్లాలోని ప్రజలకు ముందుగా కోవిడ్ వ్యాక్సిన్ పై నమ్మకం కలిగించేందుకు పోలీసు శాఖలోని సిబ్బందితోపాటు వారి కుటుంబాలకు వేయించుకొని సామాన్య ప్రజలకు అవగాహన వస్తుందని అన్నారు ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు ముందుకు వస్తే తమ శాఖను చూసి జిల్లాలోని యువతీ, యువకులు చైతన్య పరుస్తూ కోవిడ్ నివారణకు ముందుకు వస్తారని సూచించారు. వైద్య అధికారులు జిల్లా పరిధిలోని వివిధ పోలీసు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంపై సంబంధిత పోలీసు అధికారులు ఆరా తీసి వ్యాక్సిన్ తీసుకోని సిబ్బందికి తక్షణమే వ్యాక్సిన్ వేయించుకోవాలని ముఖ్యంగా వ్యాక్సిన్ వేయించే సమయంలో అధికారులు అనారోగ్య సమస్యలతో బాధపడే సిబ్బందికి సంబంధించి డాక్టర్ల సలహాలను తీసుకోని వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారుకు ఎస్పీ తెలిపారు.42 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు అలాగే ప్రజా ప్రతినిధులు నాయకులు అందరూ కలిసికట్టుగా కోవిడ్ నివారణ వ్యాక్సిన్ వేసుకునే విధంగా గ్రామాల్లో సూచించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ, షాకీర్ హుస్సేన్, వనపర్తి డిఎస్పి, కిరణ్ కుమార్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్, జమ్ములప్ప, సీసీఎస్ ఇన్స్పెక్టర్, శ్రీనివాస్, వనపర్తి సిఐ, సూర్య నాయక్, కొత్తకోట సీఐ, మల్లికార్జున్ రెడ్డి, ఆత్మకూరు సిఐ, సీతయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు,వెంకట్, జగన్,మరియు జిల్లాలోని ఎస్సైలు, పోలీసు సిబ్బంది వైద్య సిబ్బంది అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment