విద్యాలయాలు కు ఆయన ఆస్తులను దానం చేసిన గొప్ప సేవ మూర్తి కందుకూరి
రాజమహేంద్రవరం,పెన్ పవర్రాజమహేంద్రవరం స్థానిక వై జంక్షన్ లో కందుకూరి వీరేశలింగం పంతులు 174 వ జయంతి సందర్భంగా ఎస్.కె.వి.టి స్కూల్ ఆ స్కూల్ ప్రిన్సిపల్ శుభ్రమణ్యం ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకలను వైస్సార్సీపీ నాయకురాలు జిల్లా అధికార ప్రతినిధి,మాజీ కార్పొరేటర్ మేడపాటి షర్మిళ రెడ్డి పాల్గొని కందుకూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆమె మాట్లాడుతూ అయన మన అందరికి ఆదర్శప్రాయుడు,విద్య విషయాల్లో ప్రతి ఒక్క విద్యార్థులు, విద్యార్థినిలు చదువు కోవాలని అనే ఆశయం కొరకు ఆయన శ్రేద్ద వహిస్తూ ప్రతిఒక్కరు పట్ల ప్రేమగా ఉంటూ ఆయన ఆస్తులు విద్యాలయాలు దానం చేసి గొప్ప సేవ మూర్తి ఆయన అని కొనియాడారు.ఈ సందర్భంగా వేడుకల్లో పాఠశాల సిబ్బంది,ఆధ్యపక బృందం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment