Followers

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వాటర్ ప్లాంట్ లు

 ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వాటర్ ప్లాంట్ లు

 ప్యూరిపై పేరు తో బోరు నీటి సరఫరా

నిద్రావస్థలో అధికార యంత్రాంగం 


 

లక్షెట్టిపేట,  పెన్ పవర్

మండలంలోని అక్రమ నీటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు గా కొనసాగుతుంది. నాణ్యత లోకం తెలియని ప్రజలు బోరు నీటిని త్రాగి తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. బోరులో వచ్చే కలుషిత నీటిలో కొన్ని  రసాయన పదార్థాలు కలిపి అభం శుభం తెలియని ప్రజానీకం శ్వాసకోశ ఇబ్బందులతో పలు రోగాల పాలవుతున్నారు అసలే వేసవి కాలం కావడంతో ఈ సమయంలో వాటర్ ప్లాంట్ యజమానులు గుట్టుచప్పుడు కాకుండా బోర్ వాటర్ లో కొన్ని కెమికల్స్ కలిపి ఫిల్టర్ చేసి క్యాన్ డబ్బాలలో నింపుతూ సరఫరా చేస్తున్నారు  మున్సిపాలిటీలో మండలాల్లో ఇలాంటి దందా సుమారు చాలా ఉన్నవి వాటర్ ప్లాంట్ ఉండటం గమనార్హం వాటర్ ప్లాంటు కొనసాగిస్తూ నీటి పేరుతో అందినంత వరకు దండుకుంటున్నారు  నిబంధనలు తుంగలో తొక్కి వాటర్ దందా జోరుగా సాగుతుంది  నీటి కేంద్రాలపై ఎన్నోసార్లు పేపర్ స్టేట్మెంట్ వచ్చినా కూడా తనిఖీ చేయని రోజులున్నాయి. పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది అంతేకాకుండా  వాటర్ క్యాన్లు కొన్ని సంవత్సరాల గడిచిన క్యాన్లలో నీటిని నింపి సరఫరా చేస్తున్నారు. నీటిని నింపి ఉండడంతో దుర్వాసన నీటిని సరఫరా చేయడంతో వాటిని తాగిన ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు అంతేకాకుండా కూలింగ్ పేరుతో సుమారు 30 నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారు అక్రమ నీటి దందా కొనసాగిస్తూ అడిగిన అధికారులకు మామూలు అందిస్తున్నారనే అభిప్రాయాలు ప్రజల్లో  ఉన్నాయి ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని పలువురుకోరుచున్నారు. నిబంధనలకు నీళ్లు.... ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటర్ ప్లాంట్ నిర్వహణకు పలు మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. ప్రతి వాటర్ ప్లాంట్ లో ఒక బయో కెమిస్ట్రీ , నీటిని ఫిల్టర్ చేసే స్టీల్ క్యాన్ లు, రసాయనిక మోతాదును పరిశీలించే పరికరాలు,వివిధ రసాయనాలు ఉంటాయి., కానీ మండలం,  మున్సిపాలిటీలోపై నిబంధనలను వాటర్ ప్లాంట్ నిర్వాహకులు పాటించడంలేదు. దీంతో ప్రజలకు ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ తో గోదావరిలో నీటి నిలువ ఉండడంతో పాటు  మిషన్ భగీరథ నీరు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాటర్ ప్లాంట్ నీరే దిక్కవుతుంది. దీనిని ఆసరాగా చేసుకుని వాటర్ ప్లాంట్ నిర్వాహకులు  లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మండల, మున్సిపల్ పాలకులు, అధికారులు సరైన అనుమతి లేని వాటర్ ప్లాంట్లపై దృష్టి సారించకపోవడం తో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వాటర్ ప్లాంట్ ను తరచుగా తనిఖీ చేసే జిల్లా అధికార యంత్రాంగం నిద్ర మత్తు వదలడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.   అధికారులు పట్టించుకోవడం లేదు. సిపిఐ జిల్లా కౌన్సిల్ మెంబర్  .అవునురి వెంకటేష్ ..పత్రికా ప్రకటనలో .తెలిపారు మున్సిపాలిటీలో మండలంలోని. అనేక అక్రమ వాటర్ ప్లాంట్ నెలకొన్నాయి. వాటర్ ప్లాంట్ యజమానులు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించడం లేదు. తనిఖీలు చేయవలసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్ల ప్రజారోగ్యం పడకేసింది. ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా పాలకులు అధికారులు స్పందించి అక్రమ వాటర్ ప్లాంట్ పై కొరడా జులు పించాలి.  కలుషిత నీటి వల్ల రోగాలు వస్తున్నాయి. వాటర్ ప్లాంట్ లో క్యాన్లను నీటుగా పరిశుభ్రం చేయకపోవడం వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. వాటర్ ప్లాంట్ లో బయోకెమిస్ట్రీ ఒక పోవడం వల్ల ఎక్కువ మోతాదులో రసాయనాలు కలుపుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.తాసిల్దార్ మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి అక్రమ వాటర్ ప్లాంట్లపై దాడులు నిర్వహించి వాటిని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...