Followers

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

చింతూరు, పెన్ పవర్

చింతూరులోని అంబేద్కర్ సెంటర్ నందు బాబు జగ్జీవన్ రామ్ 114 వ జయంతిని అనుసూచిత్ జాతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ కన్వీనర్ చదలవాడ కృపాకుమార్ మరియు చింతూరు మండల బీజేపీ  అధ్యక్షులు డి. వి. ఎస్ రమణా రెడ్డి ముందుగా జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి ఉప ప్రధానిగా, కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల,పేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని అలాగే ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. ఇప్పటి తరం ఆయన అడుగు జాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి పూస శ్రీను, కన్నయ్య, సీతయ్య, రాంబాబు, గాంధీ, రాములుతదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...