Followers

ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా పేషెంట్లను చేర్చుకోవద్దు

ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా పేషెంట్లను చేర్చుకోవద్దు

కందుకూరు లో ఏరియా వైద్యశాల ఒక్కటే కరోనా హాస్పిటల్     

ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం                పెన్ పవర్, కందుకూరు

 ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా పేషంట్లను  కందుకూరు లో ఎవరో చేర్చుకోవద్దని కందుకూరు లో కేవలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలను మాత్రమే కరోనా హాస్పిటల్ గా గుర్తించామని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ వో ప్రియంవద అన్నారు. శనివారం  మండలంలోని మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విచ్చేసిన ప్రియంవద పెన్ పవర్ లో  వచ్చిన కథనంపై స్పందించారు. ఈ సందర్భంగా ప్రియంవద మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్స్ కు ప్రభుత్వం ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఇచ్చి ఉన్నారని అన్నారు. జిల్లాలో ట్రీట్మెంట్ చేసే విషయంలో పేషెంట్ల వద్ద ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. కందుకూరులో ప్రభుత్వ ఏరియా వైద్యశాల తో పాటు కోటారెడ్డి ప్రైవేట్ హాస్పిటల్ ను త్వరలో కోవిడ్ హాస్పిటల్ గా తీసుకోవాలని కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారని అన్నారు. కరోనా ఉదృతంగా వస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని కోరారు. లాక్ డౌన్ లేని కారణంగా ప్రజలు ఇష్టారీతిన మాస్కులు ధరించకుండ భౌతిక దూరం పాటించకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ లో కోవిడ్ పేషెంట్లకు 800 బెడ్ లు ఉన్నాయని, 350 బెడ్లకు ఆక్సిజన్ ఐసియు సౌకర్యం ఉందని తెలిపారు. కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కోవిడ్ పేషెంట్లకు ఇరవై బెడ్లు ఉన్నట్లు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అప్రమత్తంగా ఉంటూ అవసరమైతేనే బయటికి రావాలని కోరారు. నివారణ ఒక్కటే మార్గం అని స్వీయ నియంత్రణ  పాటించాలని ఆమె కోరారు. మండల టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్, తహసిల్దార్ సీతారామయ్య మాట్లాడుతూ పెన్ పవర్ లో కథనం చూశానని సోమవారం ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వాహకులతో  సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...