పాయల గేయాన్ని తెలుగు పాఠ్య పుస్తకం మొదటి పాఠంగా ప్రచురణ
విజయనగరం జిల్లా, సాలూరు నియోజకవర్గం, మెంటాడ మండలం, మెంటాడ గ్రామానికి చెందిన పాయల సత్యనారాయణ రాసిన వాన అనే గేయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్తగా తయారు చేయించి ముద్రించిన రెండవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం మొదటి పాఠంగా ముద్రించారు. పాయల నారాయణ హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేసినప్పటికీ, ఆయనకు తెలుగు అంటే ఎంతో ఇష్టం. ఆయన తెలుగులో అనేక గేయాలు రాశారు. వీటిలో చాలా వరకు ముద్రించారు. పాయల సత్యనారాయణ మెంటాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ ఇదే పాఠశాలలో పదవీ విరమణ పొందారు. పాయల సత్యనారాయణ రాసిన బాల రసాల కు 2004వ సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అవార్డ్ వచ్చింది.
ఈయన బాలసాహిత్యంలో గేయాలు రాయడంలో దిట్ట. ఆయనకు చైతన్య భారతి సంస్థ బాల భాను అనే బిరుదుతో సత్కరించింది. సద్గురు శతకం, ఆట పాట, చిట్టి పాప చెప్పుకో చెప్పుకో కవి పేరు చిట్టి పాప, బాల రసాల, మరో పిలుపు, వెన్నెల బుజ్జాయిలు మొదలైన పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ప్రస్తుతం చిగురాకుల అనే పుస్తకాన్ని అతని కుమారుడు మురళీకృష్ణ ముద్రించే పనిలో ఉన్నారు. ఆ పుస్తకంలోని గేయాన్నే ఇప్పుడు పాఠ్య పుస్తకంలో ప్రచురించారు. పాయల సత్యనారాయణ రాసిన రెండో తరగతిలో తెలుగు పాఠ్య పుస్తకంలో మొదటి పాఠం లో ముద్రించిన వాన గేయం.
No comments:
Post a Comment