రాగోలపల్లిలో బియ్యం, గుడ్లు, చక్కీల పంపిణీ
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఈనెల 20వ తేదీ నాటికి పాఠశాలల్లో మిగిలియున్న బియ్యం, గుడ్లు, చిక్కీలను 1 నుండి 9 తరగతుల విద్యార్థులకు సమానంగా పంపిణీ చేయాలని డైరెక్టర్ ఎండిఎం అండ్ స్కూలు శానిటేషన్, ఆంధ్రప్రదేశ్ వారు శుక్రవారం ఇచ్చిన ఆదేశాల మేరకు రాగోలపల్లి ప్రాథమిక పాఠశాలలో శనివారం బియ్యం, గుడ్లు, చిక్కీలను విద్యార్థులకు పంపిణీ చేశారు. కరోనా ఉధృతి రీత్యా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజనం కార్మికులు, ఆయా సాయంతో ఇంటి వద్దకే తీసుకెళ్ళి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు దున్నా దుర్గారావు విద్యార్థులకు, తల్లిదండ్రులకు సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. అర్హత ఉన్న అందరూ టీకా వేయించుకోవాలన్నారు. సెలవులు కొనసాగినంత కాలం ఇంటి వద్ద విద్యార్థులు ఏమేమి చదవాలో, ఎలా చదవాలో వివరించారు. ప్రభుత్వ సరఫరా మేరకు డ్రై రేషన్ పంపిణీ ఇంటివద్దకే సరఫరా చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సహోపాధ్యాయులు ఈతకోట సత్యనారాయణ, మధ్యాహ్న భోజనం కార్మికురాలు నీరుకొండ వరలక్ష్మి ఉన్నారు.
No comments:
Post a Comment