సతకం పట్టు వద్ద నెలకొల్పిన మోదకొండమ్మ పందిరి రాట
విశాఖ ఏజెన్సీలోని పాడేరులో వెలసిన ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం శ్రీ మోదకొండమ్మ అమ్మవారి పండగ మహోత్సవం వచ్చేనెల 16,17,18 తేదీల్లో నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం పాడేరులోని అమ్మవారి సతకం పట్టువద్ద రాటను నెలకొల్పారు. పాడేరు శాసన సభ్యులు, మోదకొండమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్‌పర్సన్ కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి, మాజీ మంత్రి మణికుమారి, ఆలయ ఉత్సవకమిటీ నాయకులు వెయ్యాకుల సత్యనారాయణ, ఆలయ కార్యదర్శి కొట్టుగుల్లి సింహాచలం నాయుడు సమక్షంలో అమ్మవారి రాటను శనివారం ఉదయం 10.30 సమయంలో నెలకొల్పారు. ఈ సందర్భంగా పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో నిర్వహించే మోదకొండమ్మ అమ్మవారి వేడుకను వైభవంగా నిర్వహించేందుకు పెద్దలు నిర్ణయించారని భక్తులంతా దీనికి సహకరించాలని కోరారు.
No comments:
Post a Comment